Wednesday 28 September 2011

జగన్ ఉచ్చులో జనం


                               జగన్ ఉచ్చులో జనం..!!

జగన్.... జగన్... జగన్.. ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్ అవినీతి  రాజకీయ నాయకులకు  ఈ పేరు తప్ప ఇంకేం గుర్తురావడం లేదు.
వై . యస్ . జగన్ మోహాన్ రెడ్డి ఎవరూ:

Y.S. జగన్ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Dr. Y.S. రాజశేకర్ రెడ్డి కుమారుడు.
2009 లో కడప నుంచి కాంగ్రెస్ తరుపున  పార్లమెంట్ కు పోటి చేసి విజయాన్ని సాధించాడు ఒకపక్క తండ్రి ముఖ్యమంత్రి కొడుకు ఎం.పి ఇంకేం ఉంది తండ్రిని అడ్డం పెట్టుకుని కొడుకు దేశాన్ని నిలువునా దోచుకున్నాడు. 
దేశ నలుమూలలా జగన్ కీ అస్తుల్లు ఉన్నాయి అంటే అర్చర్య పోనవసరం లేదు.
ఆరు, ఏడు ,సంవత్సరాలలోనే జగన్ ఆస్తి వేల కొట్లలో ఉందని సమాచారం. 
సెప్టెంబర్ 2. 2009 లో మహా నేత ముఖ్యమంత్రి Dr. Y.S. రాజశేకర్ రెడ్డి ప్రమాదం లో చనిపోవడం ఆంధ్ర రాజకీయాలనే కాక దేశ రాజకీయాలని సైతం కలచివేసిన సంగటన అది. 
తండ్రి తరువాత కొడుకే ముఖ్యమండ్రి అవ్వడం సినిమాలో చూసుంటాడు జగన్ తండ్రి లేదు తండ్రి పదవి నాకే వస్తుంది అనుకున్నాజగన్ ప్లాన్ బెడిసి కొట్టింది.
రాజశేకర్ రెడ్డి గారి తరువాత కే. రోశయ్య గారు పదవి చేపట్టిన కొన్ని నేలల తరువాత  అనుకోని సంగటనల వాళ్ళ రోశయ్యగారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. 
తరువాత స్తానం నకేవస్తడి అనుకున్న జగన్కీ మళ్ళి నిరాశే మిగిలింది తరువాత కిరణ్  కుమార్ రెడ్డి ముక్యమంత్రిగా నియామకం అయ్యారు. 
మా కుటుంబానికి అన్యాయం జరిగింది మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు అనీ జగన్ బహిరంగంగా రోడ్డుమీదకు వచ్చి గోలా గోలా చేసాడు.
అంటే C.M. ఇవ్వక పోవడం అన్యాయమా ? 
తండ్రి చనిపోయరనే బాధ కంటే పదవి రాలేదన్న బాధలో సొంతపార్టీ పెట్టలనుకున్నాడు దాని కోసం జనాదరణ సంపాదించుకోవడం కోసం ఓదార్పు యాత్ర చేసాడు 
Dr. Y.S. రాజశేకర్ రెడ్డి మీద ఉన్న అభిమానం తో ప్రజలు జగన్ కీ నీరాజనం పట్టారు 
జనం నావెంటే ఉన్నారు అని  పార్టీ పెట్టి దేశాన్ని దోచుకోవలనుకుంటున్నాడు. 
పార్టీ లో జనం ముందు జగన్ మేడిపండు వేషాలు వేస్తున్నాడు.
ప్రజలకు అంత తెలుసు ఎవరు ఎటువంటివల్లో
ఎంత సేపు మా నాన్నఇది,  మా నాన్నఇది చేసాడు అనీ చెప్పటం తప్పితే ఇప్పుడు నేను  ఇది చేస్తాను అనీ చెప్తునడా?  
డబ్బు తో నాయకులని కొనొచ్చు కానీ పదవిని కొనలేం అని ప్రజలు నిరూపిస్తారు.
పదవి కోసం ఎంత నీచమైన పనైనా చేస్తాడు జగన్ ఒకవేళ ప్రజలు డబ్బుకి ఆసపడి ఓటు విలువ తెలియకుండా  తన అమూల్య మైన ఓటుని అమ్ముకుంటే దొంగోడి చేతికి మన ఇంటి తాళాలు ఇచినట్టే.

ఆలోచించండి మనకు ఇలాంటి నాయకులూ అవసరమా ?

మన భవిసత్తు మన చేతిలో ఉంది మన దగ్గరున్న ఒక్క ఓటుతో ఈ దేశాన్ని మర్చేయోచ్చు
మారుద్దాం  మన రాష్టాన్ని మన దేశాన్ని - మరో  కొత్త తరానికి నంది పలుకుదాం.


మీ ...

ప్రసాద్ 
...................

No comments:

Post a Comment