Monday 26 September 2011

ప్రేమ పెళ్ళిళ్ళు - సంప్రదాయ పెళ్ళిళ్ళు


బెల్లం జీలకర్ర లేని పెళ్లి పెళ్లి కాదు 
ప్రేమ పెళ్ళిళ్ళు - సంప్రదాయ  పెళ్ళిళ్ళు 

ప్రేమ పెళ్ళిళ్ళు: ప్రేమ పెళ్ళిళ్ళు అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఒకరిని వధిలి ఇంకొకరు ఉండలేనంతగా ప్రేమించిన వాళ్ళు మాత్రమే ప్రేమ  పెళ్ళిళ్ళు చేసుకుంటారు. 
ఏదో ఒక  అమ్మాయి నచ్చింది కొంత కాలం తనతో టైం పాస్ చేసి వదిలేదం అనుకునే ప్రేమలు  పెళ్లిళ్లకు దారి తియ్యవు ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు పడతారు. 
ప్రేమలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నీ  ఎదుర్కుని ధర్యంగా నిలబడిన వాళ్ళ  ప్రేమ  మాత్రమే విజయాన్ని సాధిస్తుంది.
నిజమైన ప్రేమకు పెద్దల అభిప్రాయం చాల అవసారం.
కొంతమంది ఇంట్లో చెప్పే ధర్యం లేక ఉన్న ఊరిని కన్నా వాళ్ళని ఎదిరించే ధర్యం లేక  ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రేమను పెద్దలు ఒప్పుకోరు ఎందుకంటే కొంతమంది తల్లితండ్రులకు ప్రేమ మీద అవగాహనా లేక కొంత మందికి కూలం అడ్డు వస్తుంది. 
నిజమైన ప్రేమలు పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటారు .
ఇంకొన్ని ప్రేమలు ఇంట్లో ఎదిరించే ధర్యం లేక తప్పనిసరి పరిస్తితుల్లో వాళ్ళు వీడి పోతున్నారు.
మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 


ఇన్ని కష్టాలు పాడి ప్రేమల పెళ్ళిళ్ళు చేసుకోవడం అవసరమా ?

సంప్రదాయ పెళ్ళిళ్ళు :  మా అమ్మాయి నీ మంచి కుటుబంలో ఇవ్వలనుకుంటారు అమ్మాయి తల్లితండ్రులు అలానే మా కోడలను మంచి కుటుంబంలో నుంచి తెచుకోవలనుకుంటారు అబ్బాయి తల్లి తండ్రులు
విల్లా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు చూస్తారు ఇద్దరి జాతకాలు చూసి వీళ్ళు జీవితాంతం కలిసి ఉండగలరు అనే నమ్మకంతో  పెళ్ళికి ఓకే చెప్తారు.
పెళ్ళికి సంబందించిన ప్రతి పనినీ ఎంతో సంప్రదాయంగా ముహూర్తాలు చూసి చేస్తారు
కొబ్బరి ఆకులతో  పెళ్లి పందిరి , బాజా బజంత్రీలు ,  అక్షితలు తలంబ్రాలు ,ఇల్లంతా బంధువులతో సందడి , బావ మరదళ్ల సరదాలు ఇవన్ని సంప్రదాయ పెళ్ళిలో సకబాగం.
అబ్బాయి తలకు బాసికం కట్టికుని  పెళ్లి బట్టలు ధరించి పెళ్లి పిటలమీద కూర్చొని వడువు ఎప్పుడు వస్తుందా అని దొంగా చూపులు చూస్తాడు.
వధువు పెళ్లి వస్తలు ధరించి తలకు బాసికం కట్టుకుని తలా కిందకు పెట్టుకుని ఎప్పుడెప్పుడు తలెత్తి కాబోయే శ్రీవారిని చూద్దామా అనుకుంటుంది.
ఇద్దరు పెళ్లి పీటలమీద ఎదురుగా కూర్చొని తలమీద బెల్లం జీలకర్ర పెట్టుకుని సంప్రదాయక మంత్రాలతో మొదలవ్తుంది పెళ్ళి.
మూడుముళ్ళు ఒక్కో ముడికి ఒక్కో అర్ధం, ఏడడుగులు ఒక్కో అడుక్కు ఒక్కో నిర్వచనం చెప్పుతూ సంప్రదాయపు పెళ్ళి జరుగుతుంది.

ప్రేమ పెళ్ళిలో ప్రేమించిన వాళ్ళకే  తప్ప ఇంకెవరికీ సంతోషం ఉండదు సంప్రదాయపు పెళ్ళిలో ఇరు కుటుంబాలే కాక బంధువులు పెళ్ళి చుసిన ప్రతికోక్కరు ఏంటో సంతోషంగా నూతన వధువరులని ఆశిర్వదిస్తారు.

ప్రేమ పెళ్ళిళ్ళు రెండు మనసులను సంతోష పరిస్తే సంప్రదాయ పెళ్ళిళ్ళు రెండు కుటుంబాలను సంతోష పెడతాయి.
అందరిని సంతోష పెట్టె సంప్రదాయ పెళ్ళిళ్ళు మంచివో , అందరికి దుక్కన్ని మిగిల్చే ప్రేమ పెళ్ళిళ్ళు మంచివో ఆలోచించండి....



మీ..

ప్రసాద్
----------------

No comments:

Post a Comment